సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిరోదిద్దాం ప్రజా ఆరోగ్యాన్ని రక్షిద్దాం
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిరోదిద్దాం ప్రజా ఆరోగ్యాన్ని రక్షిద్దాం
నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయం నందు ఎ.స్.ర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్లాస్టిక్ వాడకం నిషేధం పై ఫంక్షన్ హాల్స్ మరియు హోటల్స్ టిఫిన్ సెంటర్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానులతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ
సింగిల్ యూజ్ వస్తువులైన ప్లాస్టిక్ కప్పులు గ్లాసులు స్పూన్లు ప్లేట్లు స్ట్రాలు, మరియు 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగులను హోటళ్లలో వాడకూడదని అన్నారు. ప్లాస్టిక్ భూమిలో కరగడానికి వందల ఏళ్లు పడుతుందని,ఇది భూగర్భ జలాలను కలుషితం చేయడమే కాకుండా మనం ఆహారంతో కూడిన ప్లాస్టిక్ కవర్లను బయటపడేయడం ద్వారా పశువులు ఆహారంతో పాటు ప్లాస్టిక్ కవర్లను కూడా తినడం ద్వారా వాటి ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతోందని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులలో వేడి ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అన్నారు. కావున ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అని ప్లాస్టిక్‌ను నిషేధించి,మన ఆరోగ్యాన్ని మరియు ప్రకృతిని రక్షించుకుందాం అన్నారు. 15 రోజుల్లోగా హోటల్స్ టిఫిన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో నిషేధించాలని యజమానులను కోరారు లేనియెడల నిషేధిత ప్లాస్టిక్ వాడితే జరిమానాలు విధిస్తామని అన్నారు. ఫంక్షన్ హాల్స్ నందు భోజన సమయంలో పేపర్ ప్లేట్స్ బదులుగా తాటి అరటి ఆకు ప్లేట్లను వినియోగించే విధంగా యజమానులు శుభకార్యాలు చేసుకునే వారికి అవగాహన కల్పించాలని కోరారు ఆరోగ్యవంతమైన సమాజం కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం అని పిలుపునిచ్చారు.
మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ మాట్లాడుతూ
ప్లాస్టిక్ కవర్లలో వేడివేడి ఆహారాన్ని తిని,అనారోగ్య భారిన పడవద్దని అన్నారు. ప్లాస్టిక్ కవర్స్ బదులుగా ప్రత్యన్మయ ఏర్పాట్లు చేయడం జరిగిందినీ హోటల్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానులు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే బయో కవర్లు ఉపయోగించాలని కోరారు. ఇలాంటి సమాజానికి ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎ.స్.ర్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్ గారిని మున్సిపల్ చైర్ పర్సన్ మరియు మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రామకృష్ణ,కౌన్సిలర్ పొన్నాల మనిషా ప్రకాష్,ఫంక్షన్ హాల్,హోటల్స్,టిఫిన్ & ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానులు,ప్లాస్టిక్ షాప్ యజమానులు తదితరులు పాల్గొన్నారు