BREAKING NEWS
వరంగల్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్ల బదిలీ

ఈ69న్యూస్ వరంగల్ మే 07
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు సమాచారం.ప్రస్తుతం కాజీపేట ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ రెడ్డిని శాయంపేట సీఐగా బదిలీ చేయగా, ఏహెచ్‌టీయూ ఇన్స్పెక్టర్ జె. శ్యామ్ సుందర్‌ను కాజీపేటకు నియమించారు.అలాగే పీసీఆర్‌లో పనిచేస్తున్న ఏ. మహేందర్‌ను హసన్పర్తికి బదిలీ చేశారు. ప్రస్తుతం హసన్‌పర్తిలో విధులు నిర్వహిస్తున్న వి. చేరాలను వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.