పుచ్చల శ్రీనివాసరావు, ఉమాదేవి దంపతులు
BREAKING NEWS
వార్షికోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ
సత్తుపల్లి,ఆర్ సి,కల్లూరు,మే 8(తెలుగుగళం)న్యూస్: వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కల్లూరు బస్టాండ్‌లో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. కల్లూరు మున్సిపాలిటీ కప్పలబంధం రోడ్డుకు చెందిన పుచ్చల శ్రీనివాసరావు, ఉమాదేవి దంపతులు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేసవి తీవ్రత నేపథ్యంలో వడదెబ్బ నుండి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా టీం సత్తుపల్లి సభ్యులు కిన్నెర ఆనంద్, స్థానికులు దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.