లచ్చన్నగూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ పోతురాజు చక్రధర్ రావు
పాడి రైతులకు చేయూత.. లచ్చన్నగూడెంలో ఉచిత పశువైద్య శిబిరం
సత్తుపల్లి,ఆర్ సి,మే 8(తెలుగుగళం) న్యూస్ : సత్తుపల్లి నియోజకవర్గం లోని వేంసూరు మండలంలోని లచ్చన్నగూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ పోతురాజు చక్రధర్ రావు ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించింది.శిబిరంలో వేంసూరు మండల పశు వైద్యాధికారి రాజశేఖర్, గోపాల మిత్రలు పాల్గొని పాడి రైతులకు పశుసంరక్షణపై అవగాహన కల్పించారు. ఎండాకాలంలో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాల దిగుబడి పెంచే ఖనిజ మిశ్రమాల వినియోగం, గర్భకోశ వ్యాధుల నివారణ, పోషకాహార మేత ప్రాధాన్యతపై వివరించారు.
ఈ సందర్భంగా లేగదూడల పోటీ నిర్వహించి, ఆరోగ్యంగా పెరిగిన దూడలను ఎంపిక చేసి దూడల యజమానులకు మండల పశువైద్యులు రాజశేఖర్,సర్పంచ్ పోతురాజు చక్రధర్ రావు ల చేతులమీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో: గ్రామ రైతులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.