ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు అభినందనీయం
ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు అభినందనీయం
పర్వతగిరి,తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం కమిటీ వేయడం ఉద్యమకారుల పోరాటానికి విజయమని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అన్నారు.ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ:
“తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు,ఉద్యమకారులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. ఆలస్యంగా అయినా కమిటీ వేయడం అభినందనీయం.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం అమరవీరుల కుటుంబాలకు నెలకు 25,000 గౌరవ పెన్షన్, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, 250 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన కోరారు.
“కమిటీ తొలి సమావేశం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు తీసుకోవడం, జిల్లాల్లో పర్యటించి ప్రజాభిప్రాయాలు సేకరించడం, 1969 తొలి,మలిదశ ఉద్యమకారులతో సమావేశమై స్పష్టమైన ప్రమాణాలు రూపొందించడం సముచితం”అని అన్నారు.రాజకీయాలకతీతంగా నిష్పక్షపాతంగా,పారదర్శకంగా సమగ్ర జాబితాను నిర్దిష్ట కాలవ్యవధిలో ప్రభుత్వానికి అందించాలని వెంకట్రాములు కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.