కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్యకెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య

సామాజిక విప్లవకారుడు గుర్రం జాషువా

కెవిపిఎస్ ఆధ్వర్యంలో జాషువా 131వ జయంతి

కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు
జిన్నా లచ్చయ్య

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.

సామాజిక విప్లవకారుడు నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కెవిపిఎస్) జిల్లా ఉపాధ్యక్షులు జిన్న లచ్చయ్య అన్నారు. సోమవారం మరిపెడ మండలంలోని అబ్బాయి పాలెం గ్రామంలో గుర్రం జాషువా 131 జయంతినీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలదండలతో ఘనంగానివాళులర్పించారు
గుర్రం జాషువా స్పూర్తితో ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాద భావాజాలాలకు వ్యతిరేకంగా సాంస్కృతిక సామాజిక పోరాటాలను విస్తృతంగా చేపట్టాలని జిన్నా లచ్చయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామ్రాజ్యవాదులు జాతీయ అగ్రవర్ణ దురహంకారాల కబంధ హస్తాలలో నలిగిపోతూ ఉండే రోజుల్లో గుంటూరు జిల్లా పలనాడు ప్రాంతంలో నూతన కవి ఆవిర్భవించారని, సనాతన ధర్మం పేరుతో సామాజిక అణచివేతతో పాటు ఆర్థిక దోపిడీని వేల సంవత్సరాల పాటు పెను వేసుకుని ఉన్న కుల వివక్షత రూపాలను అంతమందించడానికి ఆయన కలం ద్వారా పోరాటం సాగించారన్నారు. నేటి పాలకులు కూడా దానిని పెంచేవిధంగా యథేచ్ఛగా తమ మనువాద ఎజెండాను చాప కింద నీరులా బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడ లేని కులం యొక్క దుర్మార్గాన్ని తన కవితా రచనల ద్వారా జాషువా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యవంతులుగా మార్చారని గుర్తు చేశారు. అలాంటి గొప్ప నాయకులను నేటి యువకులు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కొండ ఉప్పలయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి కొండ వెంకన్న, గ్రామ అధ్యక్షులు జనక సైదులు, కెవిపిఎస్ నాయకులు జిన్నా రాము, జినక ఉదయ్, ఉపేందర్, యాకన్న, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *