స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలి: మంత్రి సీతక్కస్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలి: మంత్రి సీతక్క
  • మహిళలకు ఉపాధి.. వ్యాపార నైపుణ్యాలకు వేదిక
  • ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌, టీ కేంద్రం ప్రారంభం
  • స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలి: మంత్రి సీతక్క

తెలుగు గళం ములుగు, సెప్టెంబర్ 28:

మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వం కల్పిస్తున్న స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతమై వ్యాపారవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం రెండో అంతస్తులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌, టీ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం క్యాంటీన్‌లో ఏర్పాటు చేసిన వంటశాల, భోజన సదుపాయాలు, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యుల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు కేవలం ఉపాధి పొందడమే కాకుండా వ్యాపార నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని భవిష్యత్తులో సొంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకునే స్థాయికి ఎదగాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు మహిళలకు స్థిరమైన ఉపాధి కల్పించడంతో పాటు నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు, వినియోగదారుల సేవలపై అనుభవాన్ని అందిస్తాయని తెలిపారు. ఐడీఓసీలో విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో సరసమైన ధరలకు అందించాలని మంత్రి నిర్వాహకులకు సూచించారు. ప్రజల ఆదరణ పొందేలా క్యాంటీన్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఇతర మహిళా సంఘాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మెప్మా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *