తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను రేగొండ పోలీసులు పట్టుకున్నారు.ఎస్సై డి.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం ఉదయం రేగొండ మండలం కనపర్తి గ్రామ శివారు నుంచి పరకాల వైపునకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందింది.దీంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి,అనుమతి పత్రాలు లేని మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు.ఈ ఘటనలో కనపర్తి గ్రామానికి చెందిన డ్రైవర్లు సాదు సదానందం,శ్రీపతి అర్జున్,శ్రీపతి భాస్కర్లను అదుపులోకి తీసుకొని,మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
