జిల్లా పరిషత్ హై స్కూల్ చిల్లంచెర్ల ప్రధానోపాద్యాయులు మంద జయ జిల్లా పరిషత్ హై స్కూల్ చిల్లంచెర్ల ప్రధానోపాద్యాయులు మంద జయ

జిల్లా పరిషత్ హై స్కూల్ చిల్లంచెర్ల ప్రధానోపాద్యాయులు మంద జయ

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.

బతుకమ్మ అంటే బ్రతుకు నిచ్చే అమ్మ అని బ్రతకడం నేర్పే అమ్మా అని అర్థం అందులో భాగంగానే బతకడానికి జీవితంలో ఉపయోగపడే బతుకు పాఠాలు నేర్పేది అమ్మ ఒడిలాంటి బడి బతుకమ్మ అని ,సాధారణంగా దేవుణ్ణి పూలతో పూజిస్తారు కానీ పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణదని ఈ ప్రపంచానికి సాంస్కృతిక వారసత్వాన్ని ఇచ్చింది తెలంగాణ ప్రాంతమని చిల్లంచెర్ల ప్రధానోపాధ్యాయులు మంద జయ అన్నారు,గత కొన్ని సంవత్సరాలుగా చిల్లంచెర్ల ఆవాస ప్రాంతంలో తల్లిదండ్రుల సహకారంతో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు పిల్లలందరరూ ఒకరికొకరు సహకారంతో తరగతుల వారీగా చక్కగా రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను చేసి బతుకమ్మకు సమర్పించి అగరవత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి బతుకమ్మలు ఒకచోట పెట్టి దాని చుట్టూ పిల్లలు అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు కూడా కలిసి ఆడి పాడారు,అదేవిధంగా తల్లులు కూడా సంతోషంగా ఆడి పాడారు,గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలలో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మ సంబరాలునిర్వహించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ఉత్సవాలలో పాఠశాల ఉపాధ్యాయులు కవిత,శ్రీనివాస్, రవీంద్రకుమార్,రాయిపెల్లి యాకయ్య,రహీమున్నేసా, భాస్కర్,శాంసన్ సుధాకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *