అమ్మవార్ల అవతారాల్లో అలరించిన చిన్నారులు
తెలుగు గళం న్యూస్ పామిడి
స్థానిక కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు దసరా పండుగను పురస్కరించుకొని ముందస్తు దసరా సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు నవరాత్రి ఉత్సవాల విశిష్టతను చాటిచెప్పేలా పాఠశాల విద్యార్థినులు శ్రీ దుర్గాదేవి నవదుర్గల అవతారాలలో అలంకృతులై ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులు అమ్మవారి వేషధారణలతో వేదికపై చేసిన నృత్యాలు, ప్రదర్శనలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి చేతిలో త్రిశూలం వీణ చెరకుగడ వంటి ఆయుధాలు మరియు సాంప్రదాయ ఆభరణాలు ధరించి లయబద్ధమైన నృత్యాలతో అలరించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఆర్. అనురాధ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పండుగల విశిష్టతలను నేటి తరానికి తెలియజేసే ఉద్దేశంతోనే పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు చిన్నారులలో దాగి ఉన్న ప్రతిభను సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు
కార్యక్రమం అనంతరం అమ్మవార్ల అవతారాల్లో మెరిసిన విద్యార్థినులతో కలిసి పాఠశాల కరస్పాండెంట్ ఆర్. అనురాధ రెడ్డి ఉపాధ్యాయినీలు మరియు సిబ్బంది గ్రూప్ ఫోటోలు దిగి సందడి చేశారు
