దసరా పండుగ సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని స్థానిక బిసీ హాస్టల్ వెనుక నివాసం ఉంటున్న సుమారు 15 మంది మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధిలు మాట్లాడుతూ పండగ వేళ నిరుపేద మహిళలకు అండగా నిలవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమన్ని చేసినట్లు తెలిపారు..
ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యతిపతి.శ్రీకాంత్ ట్రస్ట్ కోశాధికారి ఒర్రె కుమారస్వామి ట్రస్ట్ ప్రతినిధి పల్లెపు శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు…
