రాజరాజేశ్వరీ దేవి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ.. రిజర్వాయర్లో తెప్పోత్సవం కనులపండువగా నిర్వహణ
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ అక్టోబర్ 21

స్టేషన్ ఘనపూర్ మర్రి చెట్టు శివాలయం ఎదురు వీధిలో ఉన్న శ్రీ హనుమాన్ వాస్తు జ్యోతిష్యాలయంలో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు విజయదశమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో ముగిశాయి. విజయదశమి రోజున దుర్గామాత రాజరాజేశ్వరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అమ్మవారి ఉద్వాసన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పల్లకిలో అధిష్ఠించి భక్తులందరితో కలిసి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాలు, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య గ్రామోత్సవం కొనసాగింది. అనంతరం స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్లో అమ్మవారి తెప్పోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ మహోత్సవాలను వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నర్సింగోజు బ్రహ్మచార్యులు, రాణి దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శివసాత్విక్, సృజన్ కుమార్, కొలిపాక సునీత–సతీష్ దంపతులు, వర్షిణి, ఈశ్వర్ ప్రసాద్, ఉమ–వెంకట్, సుమ, నీతేజ్, సుజాత, ఉమ, రవీందర్, అన్నపూర్ణ, కృష్ణ–లావణ్య, అభినయ్, హాసిని, దేవకి, అరుణ, సతీష్, శివ, సాయి, రవి, పద్మ, సంధ్య, భువన్, సుగుణ–రవి, స్వరూప, మహేష్, నవనీత్, లక్ష్మీ, శంకర్, శైలజ, సింధు, విరలక్ష్మి, నిర్మల, పొత్కనూరి వేణుగోపాల్, వాణి, అనురాధ, కావ్య తదితరులు పాల్గొన్నారు.అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో మహోత్సవాల్లో పాల్గొన్నారు.