జనవరి 3న టీడబ్య్లూజేఎఫ్‌ ‌ ద్విదశాబ్ది ఉత్సవం, మూడవ మహాసభజనవరి 3న టీడబ్య్లూజేఎఫ్‌ ‌ ద్విదశాబ్ది ఉత్సవం, మూడవ మహాసభ

తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్య్లూజేఎఫ్‌) ఏర్పడి 20 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ద్విదశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఫెడరేషన్‌ నిర్ణయించింది. అదే రోజు జరిగే టీడబ్య్లూజేఎఫ్‌ ‌రాష్ట్ర మూడో మహాసభను విజయవంతం చేయాలని ఫెడరేషన్‌ యాక్టింగ్ ప్రెసిడెంట్ పిల్లి రాంచందర్‌, ప్రధానకార్యదర్శి బి. బసవపున్నయ్య జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదారబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీడబ్య్లూజేఎఫ్‌ ‌రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పలు తీర్మానాలను ఆమోదించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజహితం కోసం పని చేసే జర్నలిస్టులు..అనేక వ్యయప్రయాసలకోర్చి వార్తలు సేకరిస్తున్నారని చెప్పారు. అలాంటి జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ కోరింది. ఇండ్లస్థలాలకోసం మంత్రి ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినా అది పని చేస్తుందా? లేదా? అన్న అనుమానం వ్యక్తంచేసింది. రాష్ట్ర కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇండ్ల జాగా సమస్య పరిష్కరించి, జిల్లాల్లో జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఖమ్మంలో జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని వెంటనే వారికి అప్పగించాలని డిమాండ్‌ ‌చేసింది. కొన్ని జిల్లాల్లో అక్రెడిటేషన్ ‌కార్డులు జారీచేయాలంటే పోలీస్‌ ఎంక్వయిరీ చేస్తున్నారని, అటువంటి పద్దతులను మానుకోవాలని సూచించింది. అర్హులైన జర్నలిస్టులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ప్రశ్నించే జర్నలిస్టులపై అకారణంగా కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పేదలపక్షాన గొంతెత్తే జర్నలిస్టులకు రక్షణ లేకుండాపోయిందని ,ముఖ్యంగా ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యాక్టింగ్ ప్రెసిడెంట్ రాంచందర్, ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య విమర్శించారు. ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయిందని చెప్పారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఎంతో మంది జర్నలిస్టులకు జర్నలిస్టు హెల్త్‌‌కార్డులు ఉపయోగపడటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, లేనిచో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ, గుడిగ రఘు, బట్టిపాటి రాజశేఖర్‌, మాణిక్‌ ‌ప్రభు,
రాష్ట్ర కార్యదర్శులు దయాసాగర్‌, ఈ చంద్రశేఖర్‌,
సలీమా,
‌గండ్ర నవీన్‌, జగదీష్‌, నిరంజన్‌, వెంకటేష్‌, బిక్షపతి, విజయానంద్‌‌రావు, హెచ్ యు జే అధ్యక్షులు అరుణ్ కుమార్, ఖమ్మం అధ్యక్ష కార్యదర్శులు ఖదీర్,శ్రీనివాస రెడ్డి తోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు, కౌన్సిల్‌ ‌సభ్యులు, జాతీయ కౌన్సిల్‌సభ్యులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *