తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశాల మేరకు, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనలతో, ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవులపల్లి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శివాపురం గ్రామపంచాయతీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి అంగన్వాడీ భవనం మంజూరైంది. ఈ నేపథ్యంలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి ఈరోజు ముగ్గు పోసి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు మెరుగైన విద్య, పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జబ్బ సరోజన, పిఏసిఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవియాదవ్, ఆత్మ డైరెక్టర్ దుబ్బాక రాకేష్ రెడ్డి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సుంకరి సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కప్పల అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ పెంచికాల రాంబాబు, జబ్బ రాము, సేమ్లా బద్రి, ఈసం కాంతారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ భవనం మంజూరు చేసిన మంత్రి సీతక్క



