గ్రామాల్లో ఉపాధి హామీ పనులు తనిఖీ
వరంగల్ జిల్లా:పర్వతగిరి,కల్లెడ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ మాలోత్ శంకర్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.పని ప్రదేశాలను సందర్శించి కూలీల హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.ప్రతి గ్రామంలో రోజూ 250 మంది కూలీలు తప్పనిసరిగా పనికి హాజరుకావాలి.ఎండలు తీవ్రంగా పెరుగుతున్నందున ఉదయం 6 గంటలకు పనులు ప్రారంభించి 10 గంటల వరకు మాత్రమే పని చేయాలి.కొలతల ప్రకారం నాణ్యతతో పనులు పూర్తి చేయాలి.
పని ప్రదేశాల్లో కూలీలకు నీడ, మంచినీరు, మెడికల్ కిట్* సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలి.వేసవి జాగ్రత్తలు:
“అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూలీలు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.పని చేసే సమయంలో తరచూ నీరు తాగాలి, తలపై గుడ్డ లేదా టోపీ ధరించాలి. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవాలి.అవసరమైతే ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవడం ద్వారా నీరసం, అలసటను నివారించవచ్చు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు” అని ఎంపీడీఓ శంకర్ నాయక్ సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రఘు,ఫీల్డ్ అసిస్టెంట్లు లింగమూర్తి, సాయిలు,ఉపాధి కూలీలు పాల్గొన్నారు.