జనక్ ప్రసాద్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం
తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ , ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఐఎన్టీయూసీ నేత తీగల క్రాంతి కుమార్. కార్మిక రంగంలో జనక్ ప్రసాద్ చేసిన సేవలకు గుర్తింపుగా న్యూఢిల్లీలో జిహెచ్ఆర్టి ఇండియా , వెబ్బిక్ యూనివర్సిటీల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొని డాక్టరేట్ పట్టాను జనక్ ప్రసాద్ కు అందజేశారు. క్రాంతి కుమార్ మాట్లాడుతూ దశాబ్దాలుగా కార్మిక రంగంలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా , శాశ్వత వేజ్ బోర్డ్ సభ్యుడిగా , కార్మికుల హక్కుల పరిరక్షణకు , సంక్షేమానికి విశేష కృషి చేస్తూ , కార్మికుల సమస్యలు , జీతభత్యాలు , సంక్షేమ పథకాలు , కార్మిక చట్టాలపై అపారమైన అనుభవం కలిగిన జనక్ ప్రసాద్ కు డాక్టరేట్ గౌరవం లభించడం ఐఎన్టీయూఎస్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గాని కార్మికులందరికీ గర్వించదగిన విషయమని తెలుపుతూ సత్తుపల్లి ఐఎన్టియుసి నాయకులు , కార్యకర్తలు , ఉద్యోగులు డి.ఎల్.ఆర్ కార్మికులందరూ హర్షం వ్యక్తం చేశారు