

ఈ69న్యూస్ జనగామ ఏప్రిల్ 05
జనగాం జిల్లా పెంబర్తి గ్రామంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ భరత్ మరియు రతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పలువురు పేకాటగాళ్లు పట్టుబడ్డారు.పోలీసులు వారి వద్ద నుండి పేకాట కార్డులు, నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇలాంటి అక్రమ చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.