PRAJAVANI
BREAKING NEWS
ప్రజావాణి కార్యక్రమం రద్దు
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం ఒక ప్రకటనలలో తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమము ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తామని కలెక్టర్ వెల్లడించారు.