లక్నేపల్లి గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలుగు గళం న్యూస్ నర్సంపేట / లక్నెపల్లి జూన్ 2
నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు గ్రామ పార్టీ అధ్యక్షులు పాత్కాల కొమ్మాలు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాట స్ఫూర్తి, విద్యార్థుల అంకితభావం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారి ఆశయాలను సాకారం చేయడం మనందరి బాధ్యత. అనేక పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం స్వాభిమానానికి ప్రతీకగా మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధితో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భారపాక భాస్కర్ ఉపాధ్యక్షులు గొట్టపర్తి శివ మాజీ సర్పంచ్ గోడిశాల రాంబాబు మండల యూత్ అధ్యక్షులు గన్న రాజేష్ రెడ్డి మాజీ వార్డ్ మెంబర్లు మిడిమాలపు అనిల్ రెడ్డి గజ్జే కుమార్ పాలడుగుల వినోద్ కుమార్ మరియు బొర్రా దేసింగరావు సీనియర్ నాయకులు మార్పు మహేందర్రెడ్డి భారపాక మొగిలి కోల రవి దార దిలీపు గోడిశాల జగన్ బండి సాంబయ్య షేక్ రఫీ సాబ్ తదితరులు పాల్గొని జెండా ఆవిష్కరణని విజయవంతం చేయడం జరిగినది.