BREAKING NEWS
స్టేషన్ ఘనపూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో క్యాంటీన్‌కు తాళం

అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో చర్య–మరో నెల గడువు ఇచ్చిన ఆర్టీసీ అధికారులు
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ మే12
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న క్యాంటీన్‌ను ఆర్టీసీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. క్యాంటీన్ నిర్వాహకుడు గత ఐదు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఇప్పటికే రెండు నెలలుగా పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ అద్దె చెల్లించకపోవడం వల్ల తాళం వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో క్యాంటీన్ నిర్వాహకుడు మరో నెల రోజుల గడువు కోరినట్లు సమాచారం.అయితే, ఆ గడువులోపల అద్దె చెల్లించకపోతే కాంట్రాక్టును పూర్తిగా రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. సీనియర్ అసిస్టెంట్ శ్రవంతి ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.