Month: August 2026

పామిడిలో భగవద్గీత కర్మయోగంపై గీతా జ్ఞాన యజ్ఞం

పామిడిలో భగవద్గీత కర్మయోగంపై గీతా జ్ఞాన యజ్ఞం

భగవద్గీతలోని కర్మయోగ సిద్ధాంతంపై పామిడిలో గీతా జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. చిన్మయ మిషన్ అనంతపురం ఇంచార్జ్ స్వామి ఆత్మావిదానంద సరస్వతి స్వామివారు భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగంపై…

దర్ధపల్లిలో దండెమ్మ తల్లి బోనాల వేడుకలు

దర్ధపల్లిలో దండెమ్మ తల్లి బోనాల వేడుకలు

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం పరిధిలోని దర్ధపల్లి గ్రామంలో దండెమ్మ తల్లి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్…

ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడిగా రాజేందర్ ఎన్నిక

ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడిగా రాజేందర్ ఎన్నిక

జాఫర్‌గడ్ మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా తాటికాయల రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాఫర్‌గడ్ మండల కేంద్రంలోని స్థానిక రామాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రాఫర్స్ యూనియన్…

కేసీఆర్‌కు ఘన స్వాగతం.. ములుగు గడ్డపై బీఆర్‌ఎస్ శ్రేణుల జోష్!

కేసీఆర్‌కు ఘన స్వాగతం.. ములుగు గడ్డపై బీఆర్‌ఎస్ శ్రేణుల జోష్!

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లాలో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కేసీఆర్‌కు ఘన స్వాగతం…

కొమురం భీమ్‌కు ఘన నివాళి

కొమురం భీమ్‌కు ఘన నివాళి

“జల్–జంగల్–జమీన్” కోసం కొమురం భీమ్ పోరాటం.. నేటి ఆదివాసీ తరానికి అదే స్ఫూర్తి! ఆదివాసీ హక్కుల పరిరక్షణకు బిఆర్ఎస్ అండగా నిలుస్తుంది: లక్ష్మణ్ బాబు ఏటూరునాగారం: ప్రపంచ…

పేద విద్యార్థి కలకు కుంజ సూర్య అండ

పేద విద్యార్థి కలకు కుంజ సూర్య అండ

NIT వరంగల్ సీటు కోసం ఆర్థిక ఇబ్బందులు.. అఖిలకు అండగా నిలిచినా కాంగ్రెస్ పార్టీ నాయకులు చదువు ఆగకూడదంటూ ముందుకొచ్చిన కుంజ సూర్య.. అఖిల భవిష్యత్తుకు భరోసా…

ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటూరునాగారంలో ఆదివాసీ సమాజం భారీగా నిర్వహించిన వేడుకలకు స్థానిక ఐటీడీఏ పీఓ, జిల్లా కలెక్టర్ హాజరు కాకపోవడం తీవ్రంగా బాధాకరమని ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆదివాసీల హక్కులు, సమస్యలు, జల్–జంగల్–జమీన్ పరిరక్షణ, పోడు భూములు, అటవీ హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, రహదారులు, మౌలిక వసతులు తదితర అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఇలాంటి కీలకమైన రోజున ఆదివాసీ సమాజం మధ్య ఉండాల్సిన ఉన్నతాధికారులు కార్యక్రమానికి దూరంగా ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఏటూరునాగారంలో వై జంక్షన్‌ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, కొమురం భీమ్‌కు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం గిరిజన భవన్‌లో వేడుకలు నిర్వహించారు. వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీలు తమ సమస్యలు, డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే మెమోరాండాలు స్వీకరించి, సమస్యలపై ప్రత్యక్షంగా స్పందించాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని వారు తెలిపారు. “ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజునే ఆదివాసీలను అధికారులు పట్టించుకోకపోతే.. ఇక మా సమస్యలు ఎప్పుడు వింటారు?” అని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రశ్నించారు. ఆదివాసీ ప్రాంతాల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఐటీడీఏ పరిధిలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ వెంటనే స్పందించి ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమస్యలపై కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఆదివాసీల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం కొనసాగిస్తే, ప్రజాస్వామ్య పద్ధతిలో మరింత బలమైన ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని ఆదివాసీ సంఘాలు డిమాండ్.

ప్రపంచ ఆదివాసి దినోత్సవానికి అధికారులు డుమ్మా.. ఆదివాసీ సమాజం ఆగ్రహం!

ఐటీడీఏ పీఓ, జిల్లా కలెక్టర్ గైర్హాజరు బాధాకరం.. ఆదివాసీ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యమా? ఆదివాసీల గోడు వినేందుకు సమయం లేదా? — వెంటనే స్పందించాలి: ఆదివాసీ సంఘాల…

ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఆదివాసీ ఐక్యత, ఆత్మగౌరవం వెల్లివిరిసింది. ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత, విద్యార్థులు, గిరిజన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఏటూరునాగారం జనసంద్రంగా మారింది. ప్రధాన రహదారులు ఆదివాసీ నినాదాలతో మార్మోగాయి. వై జంక్షన్‌ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన గిరిజనులు, యువత, మహిళలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఆదివాసీ హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి–సంప్రదాయాల పరిరక్షణకు సంబంధించిన నినాదాలతో ర్యాలీ సాగింది. ర్యాలీ అనంతరం కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు జెండా ఆవిష్కరించి ఆదివాసీ సమాజం ఐక్యతను చాటారు. అనంతరం గిరిజన భవన్‌లో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలతో అదరగొట్టిన గిరిజనులు వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న గిరిజనులు చేసిన ఆదివాసీ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆశ్రమ పాఠశాలలు, పాఠశాలల విద్యార్థులు సైతం ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాటం ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ.. ప్రపంచ ఆదివాసి దినోత్సవం కేవలం వేడుకలకు పరిమితం కాకుండా ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, జల్–జంగల్–జమీన్ పరిరక్షణకు పునరంకితమయ్యే రోజుగా నిలవాలని అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో రాజ్యాంగ హక్కులు, చట్టపరమైన రక్షణలు సమర్థవంతంగా అమలు కావాలని, ఆదివాసీల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాలను కోరారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, భాష, జీవన విధానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. “ఆదివాసీ ఐక్యతే మన బలం.. హక్కుల పరిరక్షణే మన లక్ష్యం" అనే సందేశంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఆదివాసీల భారీ భాగస్వామ్యంతో ఏటూరునాగారంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి

ఏటూరునాగారంలో హోరెత్తిన ఆదివాసీ గర్జన

ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా.. వై జంక్షన్‌ నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ కొమురం భీమ్‌కు ఘన నివాళులు.. సంప్రదాయ నృత్యాలతో మార్మోగిన ఏటూరునాగారం. ప్రపంచ…

పస్రాలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

పస్రాలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

జల్–జంగల్–జమీన్‌పై రాజీ లేదు.. 1/70, అటవీ హక్కుల అమలుకు ఆదివాసీల సమర శంఖం! అధికార యంత్రాంగం కానరాలేదు.. హక్కుల కోసం వందలాది ఆదివాసీల కదలికతో పస్రా హోరెత్తింది!…

ఇండ్ల స్థలాల పేదలు జైల్ బరో కు రండి సీపీఎం

ఇండ్ల స్థలాల పేదలు జైల్ బరో కు రండి సీపీఎం

సత్తుపల్లి మండలం కాకర్లపల్లి, తుంబూరు గ్రామాలలో ఇండ్లు లేని పేదలతో సీపీఎం నాయకులు జాజిరి శ్రీనివాస్,జ్యోతి లు ఆదివారం సమావేశమయ్యారు. ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు,పక్కా…