నల్లబెల్లి విద్యార్థికి ఏప్సెట్లో స్టేట్ 400 ర్యాంక్
నల్లబెల్లి విద్యార్థికి ఏప్సెట్లో స్టేట్ 400 ర్యాంక్
తెలంగాణ ఏప్సెట్ 2025-26 ఫలితాల్లో స్టేట్ 400 ర్యాంక్ సాధించిన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి (విద్యానగర్) గ్రామ విద్యార్థి ఢిల్లీ రీత్విక్ను ప్రముఖులు ఘనంగా సన్మానించారు.తెలంగాణలో ఇంజనీరింగ్,అగ్రికల్చర్,ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏప్సెట్ 2025-26ఫలితాలను ఆదివారం ప్రభుత్వ సలహాదారుడు కే. కేశవరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి.బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు.ఈ ఫలితాల్లో నల్లబెల్లి (విద్యానగర్) గ్రామానికి చెందిన ఢిల్లీ నీత-దేవేందర్ రావు దంపతుల కుమారుడు ఢిల్లీ రీత్విక్ స్టేట్ 400 ర్యాంక్ సాధించాడు.
ఈ సందర్భంగా వర్ధన్నపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జ గోపాల్ రావు,మాజీ జెడ్పీటీసీ మార్గం బిక్షపతి, మాజీ ఎంపీటీసీ దుగ్యాల జ్యోతి మాధవరావు,మాజీ సర్పంచ్ ముత్యం సంపత్,మాజీ ఉప సర్పంచ్ బిర్రు చంద్రయ్య విద్యార్థిని ఘనంగా సన్మానించారు.గుజ్జ గోపాల్ రావు, మార్గం బిక్షపతి మాట్లాడుతూ…”ఇంకా మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని నల్లబెల్లి (విద్యానగర్) గ్రామానికి మంచి పేరు తేవాలి” అని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు సురేష్, యమునా చారీ, వెంకటేశ్వరరావు,కనుకయ్య, కుమారస్వామి,సుధాకర్ పాల్గొన్నారు