రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు - వానాకాలం సాగుకు రావూరులో అవగాహన
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – వానాకాలం సాగుకు రావూరులో అవగాహన
పర్వతగిరి,వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు పర్వతగిరి మండలం రావూరు గ్రామంలో”రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు”కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. డా.వి.వెంకన్న,శాస్త్రవేత్త మాట్లాడుతూ….
“మార్కెట్లో లాభసాటిగా ఉన్న వరి రకాలను పండించండి. యూనివర్సిటీ అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాలతో పురుగు తెగుళ్లు తగ్గి అధిక దిగుబడులు వస్తాయి. రసాయనాలను అవసరం మేరకే వాడి నేల ఆరోగ్యాన్ని కాపాడాలి” అని సూచించారు.
డా. జె. భార్గవి,శాస్త్రవేత్త: మాట్లాడుతూ”యూరియా వాడకాన్ని తగ్గించడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు.పంట మార్పిడితో స్థిర ఆదాయం వస్తుంది.నేల ఆరోగ్యానికి జిలుగు, జనుము,పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట ఎరువులు వేయాలి.వరి పంటలో నేరుగా విత్తనాలు వెదజల్లి అధిక దిగుబడులు పొందవచ్చు”అని వివరించారు.మండల వ్యవసాయ అధికారి టి. ప్రశాంత్:
“రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని శాస్త్రీయ మెలకువలు పాటించాలి. పి.ఎస్.బి, రైజోబియం వంటి జీవన ఎరువులు వాడాలి. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సమగ్ర వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి” అని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జి. భద్రమ్మ, వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఎల్.సిరివల్లి, ఎండీ. సోహెల్,50 మంది రైతులు పాల్గొన్నారు.శాస్త్రవేత్తలు రైతుల సందేహాలను నివృత్తి చేశారు.