శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు

బంజారా భవన్ నందు సద్గురు సంత్ శ్రీసేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం నగరం నందు బంజారా భవన్ నందు జరిగింది”భోగ్ బండారు” కార్యక్రమoలో కుల పెద్దలు ఉద్యోగ ఉపాధ్యాయు , విద్యార్థి యువకులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన రాష్ట్ర కోఆర్డినేటర్ భూక్య బిక్షపతి రాథోడ్ అధ్యక్షత వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొని మాట్లాడారు . శ్రీ సేవాలాల్ మహారాజ్ ఈ గిరిజన జాతి చైతన్య పరుస్తూ చేసినటువంటి ప్రబోధలు వల్ల సమాజంలో ఒక గుర్తింపును తీసుకురావడం ఆనాడే పశుసంపద అభివృద్ధి చెందాలని సమాజంలో మూఢవిశ్వాసాలు మానుకొని స్త్రీలను గౌరవిస్తూ స్థిర వ్యవసాయం చేస్తూ సమాజంలో ఈజాతికి ఒక గౌరవం తీసుకొచ్చిన మహనీయుడు సేవలాల్ మహారాజ్ అని కొనియాడారు . ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన నాయకులు కిషన్ నాయక్, ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్, మాలోత్ రాము నాయక్, టి ఎస్ టి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంగ్యా నాయక్, భూక్య శోభన్ నాయక్, గిరిజన నాయకులు రాంబాబు నాయక్, డి వెంకట్రాం నాయక్, బిచ్చు నాయక్, తారాబాయి, ప్రమీల బాయ్, ఏ సీఎం రాములు నాయక్ , బద్రు నాయక్, రాజ్ కుమార్ నాయక్ , నెహ్రూ నాయక్ తదితరులు పాల్గొన్నరు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *