సీపీఎం మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు"
సీపీఎం మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు”
మేడ్చల్,సెప్టెంబర్03(తెలుగు గళం) న్యూస్: మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల పరిధిలోని ఎన్జేఆర్ కాలనీ (సర్కిల్–1) ప్రధాన రహదారి గుంతలమయమై అధ్వానంగా మారిందని సీపీఎం కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఆటోలు, అంబులెన్సులు సైతం రావడానికి ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి తాత్కాలిక మరమ్మతులతో పాటు శాశ్వతంగా బీటీ/సీసీ రోడ్డు నిర్మించాలని సీపీఎం మండల కమిటీ డిమాండ్ చేసింది.
