- మండల ఎస్సీ సెల్ అధ్యక్షులుగా బసారీకారి హరికృష్ణ
- కాంగ్రెస్ బలోపేతానికి నూతన కమిటీ కృషి చేయాలి
తెలుగు గళం మంగపేట, సెప్టెంబర్ 29:
తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మట్టేవాడ తిరుపతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెట్టిపెళ్లి వెంకటేశ్వర్లు నాయకత్వంలో మంగపేట మండలం బుచ్చంపేట గ్రామంలో నూతన ఎస్సీ సెల్ గ్రామ కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బసారీకారి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంపెల్లి వీరస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు మైప లాలయ్య పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు ఎస్సీ వర్గాల సమస్యలు, సంక్షేమం, అభివృద్ధి కోసం నూతన కమిటీ నిరంతరం పనిచేయాలని వారు సూచించారు. నూతన కమిటీ అధ్యక్షులుగా కాటూరి రాజు, ఉపాధ్యక్షులుగా దైద నరేష్, ప్రధాన కార్యదర్శిగా పగిడిపల్లి రవి, కార్యదర్శులుగా కాటూరి నవీన్, ఎలిశాల సమ్మయ్య, ప్రచార కార్యదర్శిగా బూర్గుల శివాజీ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా ధైద ఉప్పాలయ్య, అక్కిపెల్లి మధు, గిద్దె యాకయ్య, బొడ్డు వెంకటయ్య ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీహరి, గడ్డం పరమేష్, ఎంపెల్లి సమ్మయ్య, పన్నాల కొండల్ రెడ్డి, పల్లె శోభన్, ధర్మారపు యాకయ్య, జంగం భానుచందర్, రాచకొండ సోములు, ధర్మారపు సాయిలు, పల్లె రాములు, బంటు రాములు, ఎడ్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
