ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు సాధించిన యామినికి ఘన సన్మానంఎంబీబీఎస్‌లో ఉచిత సీటు సాధించిన యామినికి ఘన సన్మానం

భరణిపాడు బీసీ కాలనీకి చెందిన నామా రమేష్, నాగిని దంపతుల కుమార్తె నామా యామిని జగిత్యాలలో ఎంబీబీఎస్ చదివేందుకు ఉచితంగా సీటు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామానికి చెందిన యామిని ప్రతిభతో వైద్య విద్యలో సీటు సాధించడం గ్రామానికి గర్వకారణమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీపీఎస్ పాఠశాలలో గ్రామ పెద్దలు, గ్రామ నాయకుల ఆధ్వర్యంలో యామినిని ఘనంగా సన్మానించారు.09 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో: పాఠశాల ప్రధానోపాధ్యాయులు బూరుగు సుజ్యాన్ రాజు, శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాజు, పాఠశాల, అంగన్‌వాడీ సిబ్బంది, పంచాయతీ సభ్యులు, మహిళలు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.
మందపాటి మహేశ్వరరెడ్డి, మందపాటి వెంకటరెడ్డి, మందపాటి వెంకట రామిరెడ్డి, మందపాటి ప్రసాదరెడ్డి, బొంతు ప్రసాద్, మందపాటి సూరిబాబు, గొర్ల వెంకటప్పరెడ్డి, మాదిరాజు మురళి, షేక్ బాలయ్య, షేక్ సలీం, తెలగారపు ప్రసాద్, సూరటి ప్రసన్న, పబ్బు శ్రీను, బోయ యేసు, సింగపోగు రాజేష్, పరసా బాలకృష్ణ, పరసా వెంకటేష్, పరసా వీరయ్య, విసంపల్లి నాగులు, జూంజునూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *