- కరాటేలో మూడు బంగారు పతకాలు.. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
- పాఠశాలకు, జిల్లాకు పేరు తీసుకురావాలి – అభినందించిన ఉపాధ్యాయులు
హనుమకొండలోని జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కరాటే స్కూల్ గేమ్స్ సెలెక్షన్స్‌లో ఏటూరునాగారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. పాఠశాలకు చెందిన వసంత విశాల్ సాయి, గడ్డం వర్షశ్రీ, కుంట వర్షిత్ అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. దీంతో ఖమ్మంలో జరగనున్న రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు వారు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను కోచ్ హుస్సేన్, పాఠశాల ఉపాధ్యాయులు, ములుగు జిల్లా కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.డి. అబ్బు అభినందించారు. రాష్ట్ర స్థాయిలోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, ములుగు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
