తెలుగు గళం న్యూస్ ఐనవోలు/అక్టోబర్ 09
హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో,ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు హక్కు పరిరక్షణ పాదయాత్ర అయినవోలులో జరిగింది.వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు ఆదేశాల మేరకు, అయినవోలు మండల పార్టీ అధ్యక్షులు మోహన్ గౌడ్ పిలుపు మేరకు అయినవోలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,ఎన్నికలలో అక్రమాలకు పాల్పడిన కేంద్ర ఎన్నికల సంఘం జ్ఞానేష్ కుమార్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పల్లకొండ రమేష్, కుమారస్వామి,జంపాల మదన్, మాజీ ఎంపిటిసి కొత్తూరు మధుకర్, అనుముల రవి, రాజయ్య, 11వ వార్డు సభ్యులు నల్లబెట్ట కళ్యాణి, చిన్న రాజు యాదవ్, కొత్తూరు శ్రీను, బరిగెల రాములు, కొత్తూరు దాస్ బాబు,రూబేను తదితరులు పాల్గొన్నారు.
