•ప్రభుత్వ వైఫల్యమే కారణం బీజేపీ
తెలుగు గళం న్యూస్ వరంగల్/అక్టోబర్9
వరంగల్ జిల్లా:ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో కరెంటు కోతలకు నిరసనగా ఈరోజు నాయుడు పెట్రోల్ పంప్ దగ్గర,తిమ్మాపురం క్రాస్ సబ్ స్టేషన్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది.నిరంతర కరెంటు కోతలతో రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. రైతులకు నిరంతర విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులను వెంటనే ఆదుకోవాలని, కోతలు లేని నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
