పండుగ సెలవుల్లో ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలిపండుగ సెలవుల్లో ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి
  • పండుగ సెలవుల్లో ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

తెలుగు గళం మంగపేట, అక్టోబర్ 9:

దసరా నవరాత్రుల సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇసుక లారీల రాకపోకలు, ఇసుక లోడింగ్‌, రవాణాను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ మంగపేట మండల ప్రజలు, జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు స్థానిక ఎస్‌ఐ, తహసీల్దార్‌లకు వినతిపత్రం అందజేశారు. పండుగ సెలవుల నేపథ్యంలో ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉందని, ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, కుటుంబాలతో ప్రయాణించే ప్రజల భద్రత కోసం ఇసుక లారీల రవాణాను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *