చదువుతో పాటు సంస్కృతి.. మరికాల కొత్తూరులో బతుకమ్మ వేడుకలుచదువుతో పాటు సంస్కృతి.. మరికాల కొత్తూరులో బతుకమ్మ వేడుకలు
  • రంగురంగుల పూలతో చిన్నారుల సందడి.. పాఠశాలలో పండుగ శోభ
  • చదువుతో పాటు సంస్కృతి.. మరికాల కొత్తూరులో బతుకమ్మ వేడుకలు

తెలుగు గళం వెంకటాపురం(నూగూర్), అక్టోబర్ 9:

ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాల కొత్తూరు ఎంపీపీఎస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దసరా సెలవుల సందర్భంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన చిన్నారులతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ వేడుకలు నిర్వహించినట్లు ఉపాధ్యాయుడు విజయ్ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చిన్నారుల్లో సంస్కృతి పట్ల మమకారాన్ని, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.“మన బడి.. మన సంస్కృతి.. మన తెలంగాణ.. మన బతుకమ్మ!”అనే సందేశంతో వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *