అధిష్టానం నిర్ణయమే కీలకం!
- ఎవరికి పట్టం కడతారో.. త్వరలో షాపల్లి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడి ప్రకటన!
- అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. ఐక్యత చాటిన షాపల్లి గ్రామస్తులు!
తెలుగు గళం ఏటూరునాగారం, అక్టోబర్ 28:
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవులపల్లి విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో షాపల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీకి ముందుకు రావడంతో వారి పేర్లను పార్టీ అధిష్టానానికి పంపించారు. అధిష్టానం పరిశీలన అనంతరం తీసుకునే నిర్ణయం మేరకు గ్రామ అధ్యక్షుడి పేరును త్వరలో ప్రకటించనున్నట్లు నాయకులు తెలిపారు. అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గ్రామస్తులు స్పష్టం చేశారు. పార్టీ ఐక్యతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రకటించిన అధ్యక్షుడికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని పేర్కొన్నారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్ల దేవేందర్, జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు, రాష్ట్ర రవాణా శాఖ డైరెక్టర్ వసంత శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు కొండగొర్ల పోషయ్య, మండల సీనియర్ నాయకులు వావిలాల ఎల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి సరికొప్పుల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్లు చేల వినయ్, డొంగిరి మధుబాబు, మండల ఎస్సీ అధ్యక్షుడు కర్నే సత్యం, రామన్నగూడెం సర్పంచ్ గద్దల నవీన్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంటా కృష్ణారెడ్డి (ఠాగూర్), షాపల్లి సర్పంచ్ రాందేని రాజు, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కుక్కల రామయ్య, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.
