అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి.డబ్ల్యూ.జే.ఎఫ్.) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ధర్నా చౌక్ నుంచి జర్నలిస్టులు భారీ ప్రదర్శన చేపట్టి కలెక్టరేట్‌కు చేరుకున్నారు.ఈ సందర్భంగా టి.డబ్ల్యూ.జే.ఎఫ్. అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ మాట్లాడుతూ డీపీఆర్వో ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయాలని, ఎలాంటి వివక్షకు తావులేకుండా నిబంధనల ప్రకారం అర్హులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్ఓకు అందజేశారు. జర్నలిస్టుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే త్వరలోనే నిరాహార దీక్షలు చేపడతామని సయ్యద్ ఖదీర్ అధికారులను హెచ్చరించారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి



