పలు కుటుంబాలను పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడుపలు కుటుంబాలను పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు

వేం నరేందర్ రెడ్డి అభిమాని గంధసిరి రాములు మృతి..పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్!

రాములు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు,సర్పంచ్ చీర వెంకటమ్మ వీరాస్వామి, స్థానిక నాయకులు

కేసముద్రం మండలంలోని అర్పణపల్లి గ్రామానికి చెందిన వేం నరేందర్ రెడ్డి అభిమాని గంధసిరి రాములు గౌడ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ గ్రామానికి చేరుకొని స్థానికి సర్పంచ్ చీర వెంకటమ్మవీరాస్వామి, మరియు స్థానిక నాయకులతో కలిసి గంధసిరి రాములు పార్దివదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించి, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు..ఈ సందర్బంగా రాములు కుటుంబ సభ్యులు ఐన నలుగురు కూతుళ్లు బుర్ర సులోచన, తండ సుజాత, తొండల నిరోజ, మొగలగొని సుకన్య లను కలిసి వారికీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.. ఇంతకుముందు తల్లిని,ఇప్పుడు తండ్రిని కోల్పోయిన నలుగురు కూతుళ్ళకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరారు.ఈ సందర్భంగా ఇటీవల రోడ్ ప్రమాదం లో మరణించిన తగురు సందీప్ ముదిరాజ్ ఇంటికి వెళ్లి తల్లితండ్రులను కూడా పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని చెప్పి,ఎలాంటి కష్టం వచ్చిన,ఎలాంటి అవసరాలు ఉన్న స్థానిక నాయకులతో మా ద్రుష్టి కి తీసుకురావాలని,మీకు ఎప్పడు కాంగ్రెస్ పార్టీ,నాయకులు అండగా ఉంటారని వారిని ఓదార్చారు..ఈ కార్యక్రమంలో బుర్ర ప్రభాకర్, బుర్ర సుధాకర్, ఉపసర్పంచ్ కంచ రాధిక,మోడెం రాజు గౌడ్,శ్రీనివాస్, గంధసిరి వెంకన్న, గంధసిరి వెంకటాద్రి, గంధం సంతోష్ కుమార్, చీర కిష్టయ్య, చీర బుచ్చిరం, గంధసిరి యాదగిరి, బబ్బురు ఉప్పలయ్య, సింగని మల్లేష్, గంధసిరి యాకంభ్రం, గంధం శ్రీనివాస్, మారగాని యాకన్న, గంధసిరి యాకన్న, కంచ అనిల్, బబ్బురు సతీష్, గంధం భరత్, శ్రీనాథ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *