పర్వతగిరి భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న పార్లమెంటులో ఆమోదం పొందిన సందర్భంగా 77వ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరణ చేశారు.ఈ కార్యక్రమంలో పర్వతగిరి అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు డాక్టర్ జిల్లా శ్రీనివాస్ మాట్లాడారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కృషి ఫలితంగా భారత రాజ్యాంగం రూపొందించడం జరిగిందని తెలిపారు.రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు,షెడ్యూల్ తెగలు, వెనుకబడిన వర్గాలు,అల్పసంఖ్యాక వర్గాలు,మహిళలకు రిజర్వేషన్ ఫలాలను పొందుపరచడం జరిగిందని చెప్పారు.రాజ్యాంగంలో సర్వసత్తాక, సామ్యవాద,లౌకిక,ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు.ఈ రాజ్యాంగం ప్రపంచంలో పెద్ద లిఖిత రాజ్యాంగమని పేర్కొన్నారు.
3వ ప్రకరణంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి వివరించడం జరిగిందని, అదే స్ఫూర్తితో 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందని తెలిపారు. భారత రాజ్యాంగం హక్కులు, చట్టాలను కల్పిస్తూ భారత ప్రజలకు పవిత్ర రాజ్యాంగంగా విరాజిల్లుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా ధర్మయ్య మాదిగ,ఆది జాంబవ సంక్షేమ సంఘం పర్వతగిరి మండల ప్రధాన కార్యదర్శి బోట్ల కనకరాజు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు ఎరువుల రంగు కుమార్ గౌడ్,భారత రాష్ట్ర సమితి యువజన అధ్యక్షులు బూర శ్యామ్ గౌడ్,స్వేరోస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికట్ల ప్రవీణ్,స్వేరోస్ ప్రాంతీయ నాయకులు జంగిలి యాకయ్య, చిన్నపెళ్లి దేవేందర్,కొల్లూరి సంతోష్,చిన్నపెళ్లి శ్రీనివాస్, కొయ్యల కుమార్, పసుల కుమార్,వల్లందాస్ లక్ష్మణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పర్వతగిరిలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం



