పోలీస్ స్టేషన్ ఎదురుగానే యువకుల వీరంగం!పోలీస్ స్టేషన్ ఎదురుగానే యువకుల వీరంగం!

మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌కు ఎదురుగానే ఉన్న ఓ బిర్యానీ సెంటర్‌లో యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. మద్యం సేవించిన యువకుల మధ్య ప్రారంభమైన చిన్నపాటి వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ పరస్పరం దాడులకు దిగారు. సుమారు 15 నిమిషాల పాటు ఈ గొడవ కొనసాగడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బిర్యానీ సెంటర్లలో మద్యం సేవించేందుకు అనుమతిస్తున్నారా? నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వ్యాపారులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుంటే నియంత్రించేది ఎవరు? అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఘటనపై విచారణ జరిపి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *