సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎస్. వెంకటాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు, వివిధ గనులు, విభాగాల అధిపతులు, అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.
అనంతరం జనరల్ మేనేజర్ ఎస్. వెంకటాచారి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు విధులను ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. రాజ్యాంగంలోని న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలను గౌరవిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని పిలుపునిచ్చారు. ದೇಶ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.
సత్తుపల్లి ఏరియాలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు



