తైక్వాండో పోటీల్లో మెరిసిన కృష్ణవేణి స్కూల్ విద్యార్థులుతైక్వాండో పోటీల్లో మెరిసిన కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు

అనంతపురం జిల్లా పెనకచర్ల డ్యామ్ వద్ద గల నిర్మలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన రాయలసీమ స్థాయి తైక్వాండో పోటీలలో పామిడి కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో తలపడిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, ఒక కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు.

పతకాలు సాధించిన విద్యార్థుల వివరాలు

  • టి. సత్య బ్రూస్ లీ బంగారు పతకం
  • టి. సత్య గౌరవ లీ బంగారు పతకం
  • బి. భవిష్య రెడ్డి బంగారు పతకం
  • పి. ప్రసన్న లక్ష్మీ బంగారు పతకం
  • జి.దేవిక బంగారు పతకం
  • పార్థసారధి రెడ్డి కాంస్య పతకం

ఈ సందర్భంగా విజేతలను వారికి శిక్షణ ఇచ్చిన తైక్వాండో కోచ్ తలారి తులసిరామ్ ను పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. అనురాధ రెడ్డి ఇంచార్జ్ శశికళ పీఈటీ మల్లికార్జున మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లోనూ మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *