వర్ధన్నపేట.పోలీసు వృత్తిలోనే కాదు,మానవత్వంలోనూ ఆదర్శంగా నిలిచారు వర్ధన్నపేట ఉప తనిఖీదారు భోగం ప్రవీణ్ కుమార్.వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన షెడ్యూల్ కులాల కాలనీకి చెందిన వంగూరి శ్రీకాంత్ ఇటీవల కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు.దాంతో ఇద్దరు చిన్నారులు తండ్రిని కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.ఆ కుటుంబం ఎదుర్కొంటున్న విషాదాన్ని, చిన్నారుల భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళనను గుర్తించిన ఉప తనిఖీదారు భోగం ప్రవీణ్ కుమార్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు.తన భార్య కస్తూరి పేరుతో 20 వేల రూపాయలను తపాలా కార్యాలయంలో స్థిర నిల్వ చేశారు.
ఆ నిల్వ పత్రాలను చిన్నారుల కుటుంబానికి అందజేశారు. చిన్నారుల భవిష్యత్తుకు తన వంతు బాధ్యతగా అండగా నిలిచారు.ఉప తనిఖీదారు స్పందన పట్ల వర్ధన్నపేట మండల ఎమ్మార్పీఎస్ కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో
వర్ధన్నపేట మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు చాడ కర్ణాకర్ మాదిగ వర్ధన్నపేట మండల ఎమ్మెస్పీ అధ్యక్షులు
ముత్యాల మల్లేశం మాదిగ.పాల్గొన్నారు.
ఖాకీ చొక్కా వెనుక మంచి మనసు



