ప్రభుపాదలో భారీ అక్రమ నిర్మాణాలు!ప్రభుపాదలో భారీ అక్రమ నిర్మాణాలు!

శేరిలింగంపల్లి సర్కిల్ కూతవేటు దూరంలో ఉన్న ప్రభుపాద లో భారీ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి భవన నిర్మాణ నిబంధనలు ప్రభుత్వం మార్గదర్శకాలు అమలవుతున్నాయా? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అంజి అనే మేస్త్రి బిల్డర్ గా అవతారమెత్తి ఓ బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపడుతున్నాడు స్థానిక ప్రజలు ప్రశ్నిస్తే ఏ మున్సిపల్ అధికారికి చెప్తావో చెప్పుకోండి జాంతానై నన్ను ఎవరు ఏమి చేయలేరు అని స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మాణంలోనున్న ఆ భారీ భవనం పరిశీలిస్తే అనుమతులు ఉన్నాయా లేవా? ఆ భవనానికి అనుమతుల అంతస్తుల సంఖ్య సెట్ బ్యాక్లు భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి భవన నిర్మాణానికి సంబంధించి సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారా? మంజూరైన ప్లాన్ ప్రకారమే నిర్మాణం చేస్తున్నారా? అనే అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది……
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
భారీ భవన నిర్మాణాలు జరుగుతున్న సమయంలో సంబంధిత మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది కానీ నిర్మాణాలపై పర్యవేక్షణ కొర వడిందా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తుంది అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నట్లయితే వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రభుపాద లో నిర్మాణంలో ఉన్న భారీ భవనాలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు సంబంధిత అధికారులు నిర్మాణ అనుమతులు మంజూరైన బిల్డింగ్ ప్లాన్లు వాస్తవంగా నిర్మిస్తున్న అంతస్తుల సంఖ్యను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *