
ఈ69న్యూస్ జనగామ,జూలై 9:జిల్లాలో మహిళా మరియు శిశు సంక్షేమ కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గ్రామస్థాయిలో మహిళలు,పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై శ్రద్ధ పెట్టాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని అన్నారు.ముఖ్యంగా,1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్‌పై విస్తృత ప్రచారం చేపట్టాలని,ప్రతి గ్రామంలో కనీసం 200 మంది మహిళలతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సులభంగా సమాచార మార్పిడి జరగేలా చూడాలని సూచించారు.బాల్యవివాహాల నిర్మూలన కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు,ర్యాలీలు,గెట్ టుగెదర్‌ల వంటి కార్యక్రమాలను గ్రామాల్లో నిర్వహించాలని ఆదేశించారు.అంగన్వాడీ కేంద్రాల నిర్వహణను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని,SAM,MAM పిల్లల ఆరోగ్య పరిరక్షణపై నిరంతరం దృష్టి పెట్టాలని అన్నారు.అనాధ పిల్లల సంరక్షణ,దత్తత ప్రక్రియను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.మహిళలపై వేధింపుల కేసుల పరంగా సఖి సెంటర్ల సేవలను గ్రామ స్థాయిలో తెలియజేస్తూ మేమున్నాం అన్న భరోసా కల్పించాలన్నారు.గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి మహిళల్లో ధైర్యం పెంచే విధంగా చైతన్యం కల్పించాలని కోరారు.ఈ సమీక్షలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఇన్చార్జ్ టిడబ్ల్యూ ఫ్లోరెన్స్,సిడిపిఓ సత్యవతి,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఉప్పలయ్య,సభ్యులు శ్రీలత,కవిత,బాలల పరిరక్షణ అధికారి రవికాంత్,చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ రవికుమార్,డిహబ్ కోఆర్డినేటర్ శారద,పోషణ అభియాన్ కోఆర్డినేటర్ శేఖర్,ఎఫ్ఆర్ఓ రాజు డీసీపీయూ సఖి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ..వారంలోగా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాలు గ్రామాలలో కనిపించేలా చర్యలు తీసుకోవాలి.ప్రతి గ్రామంలో చైతన్యం,జాగృతి ఏర్పడేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలి అని స్పష్టం చేశారు.
WhatsForm Widget
Move upMove downToggle panel: WhatsForm Widget
Copy and paste the code snippet to add bot to this post or page
OneSignal Push Notifications
Move upMove downToggle panel: OneSignal Push Notifications Send notification when post is published or updatedSend to segment All Subscribed UsersActive UsersInactive UsersEngaged UsersAll SMS SubscribersAll Email Subscribers
Customize notification content
WP to Buffer Log
Move upMove downToggle panel: WP to Buffer Log
Request Sent | Action | Profile | Status Text | Result | Response | Buffer: Status Created At | Buffer: Status Scheduled For |
---|---|---|---|---|---|---|---|
No log entries exist, or no status updates have been sent to Buffer. |
Refresh Log Export Log Clear Log
Table of Contents
Move upMove downToggle panel: Table of ContentsOpen publish panel
Notifications
Drag and drop an image, upload, or choose from your library.Select Files