వరంగల్ జిల్లా:ఏకశిల విద్యాసంస్థలు
తెలుగు గళం న్యూస్ అయినవోలు/ఏప్రిల్ 29
వరంగల్ జిల్లా:ఏకశిల విద్యాసంస్థలు ఈ ఏడాది ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాయి. సీబీస్ మరియు స్టేట్ బోర్డ్ పరీక్షల్లో 585, 582, 580, 578, 577, 576, 574, 573, 572, 571, 570 మార్కులు సాధించి ఏకశిల విద్యార్థులు తమ పట్టుదలను నిరూపించారు.ఈ సందర్భంగా పెంబర్తి, హసన్పర్తిలోని ఏకశిల టెక్నో స్కూల్లో జరిగిన అభినందన కార్యక్రమంలో సంస్థల చైర్మన్ డా. గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ… “ఏకశిలలో విద్య అంటే మార్కులు మాత్రమే కాదు, భవిష్యత్తును నిర్మించే శక్తి. ప్రతి విద్యార్థిలో ప్రత్యేక ప్రతిభ ఉందని మేము నమ్ముతాం. ఆ ప్రతిభను వెలికి తీసి విజయంగా మలచడం మా లక్ష్యం” అన్నారు. నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని తెలిపారు.
ఈ విజయంతో సంస్థకు గౌరవం, గుర్తింపు మరింత పెరిగిందని, విశ్వాసం ఉంచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మీ పిల్లల భవిష్యత్తుకు ఉత్తమ విద్యను అందించాలనుకునే తల్లిదండ్రులు తమ విజయయాత్రలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. అనంతరం చక్కటి ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బేతి కొండల్ రెడ్డి, గౌరు సువిజా రెడ్డి, ప్రిన్సిపాళ్లు బేతి శైలజ రెడ్డి, ముచ్చ స్వప్న రెడ్డి, దినేష్ రెడ్డి, ఎండీ బాబా, కేడి స్వర్ణ రాజ్, లవకుమార్, కే బిక్షపతి, అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జి జి. రామ్ ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.