కన్నుల పండుగగా 'పంబా ఆరాట్" మహోత్సవం
శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 25 ( పంచవిoశతి) మండల పూజ మహోత్సవ ఆహ్వానం రజతోత్సవ సిల్వర్ జూబ్లీ వేడుకలు.
- శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి వారి “పంభాఆరట్” మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మ శ్రీ. శంకరన్ నంబూద్రి ( శబరిమాల మేల్ శాంతి) నిర్వహించిన ప్రత్యేక “అభిషేక పూజ”లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులు. • ధర్మశాస్త అయ్యప్ప స్వామి వారి 25 వ మండల పూజ *”పంభా ఆరట్” & మహా అన్నదాన కార్యక్రమం మాదన్నపేట చెరువు వద్ద నిర్వహించినున్న పెద్ది సుదర్శన్ రెడ్డి.
- కేరళ సంప్రదాయబద్దంగా అయ్యప్ప స్వామికి పూజలు.
- బోనాలు, కోలాటాలు, వాయిద్యాలతో ఊరేగింపు.
- అయ్యప్ప స్వామికి జల స్నానాలు, అష్టాభిషేకాలు.
- మార్మోగిన శరణుఘోష, వేలాదిగా తరలివచ్చిన జనం.
నర్సంపేట పట్టణంలో కొలువుదీరిన అయ్యప్ప భక్తులు వేలాదిగా తరలివచ్చిన భక్తులు, ప్రజలు. మాదన్నపేట కట్టపై అయ్యప్ప స్వామి వారి జల క్రీడలు ఈ ప్రాంత రైతు బిడ్డగా గత 25 సంవత్సరాలుగా పంబా ఆరాట్ మహోత్సవ మహా అన్నదాన ( పంబా సద్ది) కార్యక్రమం నిర్వహిస్తున్న అభిషేకాన్ని తిలకించడానికి మాదన్నపేట చెరువుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు.ఈ పూజాభిషేఖాన్ని నర్సంపేట ప్రాంత ప్రజల శ్రేయస్సు కొరకు గత 25 సంవత్సరాలుగా అంకితమిస్తున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడుతు…
అయ్యప్ప స్వామి వారి జల క్రీడలు చేసే గొప్ప అదృష్టాన్ని అవకాశాన్ని రావాలని చెప్పి ఆలోచించినటువంటి శుభ ఘడియలు మరియు రెండు పంటలకు గోదావరి జలాలు ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి అయ్యప్ప ఆశీర్వాదంతో సాధన జరిగింది.ఇవాళ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేటువంటి అన్ని రకాల అవకాశాలు ఆశీర్వాదాలు ఆ భగవంతుడు మనందరికీ మన ప్రాంతాన్ని కల్పించారు. ప్రతి గ్రామం ప్రతి పల్లె అద్భుతంగా అందరు కూడా ఆయురారోగ్యాలతో విద్యార్థులతో చరిత్రకు ఎక్కి కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి ప్రాంతంగా మన ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు భవిష్యత్తులో కూడా చెందాలని చెప్పి ఆ భగవంతుడికి 25 సంవత్సరాలుగా పంబ ఆరట్టు కొనసాగితే 23 సంవత్సరాలు పంబా ఆరట్టు లో అన్నదానం అంటే భిక్ష పెట్టేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రాంతం ఒకప్పుడు అయ్యప్ప పంబా ఆరట్టు ప్రారంభ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి ఇవాల్టి పరిస్థితులకు చాలా మార్పు వచ్చింది. మరింత మహాద్భుతం తప్పకుండా వారి యొక్క ఆశీర్వాదంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలి మంది పిల్లలు కూడా విద్యార్థులతో ఆయురారోగ్యాలతో రెండు పంటలతో రైతాంగం కూడా సుభిక్షంగా ఉండాలి గ్రామీణార్థిక వ్యవస్థ బలపడాలి.అన్ని రకాల మౌలిక వసతులు ఈ ప్రాంతానికి రావాలని అయ్యప్ప పంపారటులో మొట్టమొదటి మరి అన్నదాతగా ఆనాడు నేను సంకల్పించి నేను ఇందులోకి వచ్చాను దాదాపుగా దేవుడు ఇచ్చినటువంటి శక్తిని ఈ ప్రాంత ప్రజల యొక్క ఆయురారోగ్యాలు విద్య, అభివృద్ధి, రవాణాభివృద్ధి గ్రామాల అభివృద్ధి పట్టణ అభివృద్ధి అన్నిటికి సంబంధించిన రైతన్న అభివృద్ధి కోసం గోదావరి జలాలను తీసుకొచ్చి పాకాల, రంగయ్య చెరువు, నడుపుతున్నటువంటి మాదన్నపేట కూడా గోదావరి అమ్మను తల్లిని ఇక్కడ తీసుకొచ్చి గొప్ప అవకాశం కల్పించినటువంటి ఆ దేవుడి ఆశీర్వాదానికి జీవితకాలం మరి ఏం చేసినా తక్కువే