విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీవిద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

హుజురాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేగొండ మండలం గాంధీనగర్ ఎంసీజేపీ బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 73 మంది విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం మంగళవారం నిర్వహించగా, ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ చేతులమీదుగా,పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ టి.కరుణ సమక్షంలో విద్యార్థినులకు ప్యాడ్లు అందజేశారు.ఈ సందర్భంగా ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ టి.కరుణ మాట్లాడుతూ, తల్లి పేరున మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందించడం అభినందనీయమని అన్నారు.విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు,పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ మాట్లాడుతూ,2011 సంవత్సరం నుంచి ప్రభుత్వ రంగంలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందిస్తున్నామని,ఈ విద్యా సంవత్సరంలో సుమారు 10 వేల పరీక్ష ప్యాడ్లను విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *