
ఈ69న్యూస్ జఫర్ఘడ్ మార్చి 31
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ అన్నం స్వప్నబ్రహ్మ రెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప సర్పంచ్ ముక్కెర గంగరాజు చిన్నారులకు యూనిఫామ్లు అందజేశారు.అనంతరం ECCE దినోత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ అనిత, వార్డ్ సభ్యులు మహమ్మద్ అంకూష్, సొన్నాయిల నాగరాజు, నక్క అజయ్, కూరపాటి విజయ్ కుమార్, గాదె మౌనిక అంబేద్కర్, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.