ఈ రోజు గోవిందా రావు పేట మండల కేంద్రంలో జరిగిన సద్గురు సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి 284 వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ సందర్భంగా మాట్లాడుతూసంత్ సేవాలాల్ మహారాజ్ గారు ఒక సంఘసంస్కర్త, బంజారాల ఆరాధ్యదైవం, ప్రకృతి ప్రేమికుడు, ఆధ్యాత్మిక గురువు, బంజారాల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకుడు, జాతి ఉద్ధారకుడు అని సేవాలాల్ తన పాటలు రచనల ద్వారా ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించాడు. అందులో ముఖ్యంగా బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు. అందుకే సంత్ సేవాలాల్ ఇతర కులాలవారికి కూడా ఆదర్శమూర్తిగా నిలిచారు అని సీతక్క గారు కొనియాడారు రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అని సీతక్క గారు అన్నారుఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రసుపుత్ సీతారాం నాయక్,జిల్లా నాయకులుపాలడుగు వెంకట కృష్ణ,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులుభూక్యా సారయ్య, గ్రామ సర్పంచ్ లావుడ్య జోగా నాయక్,యూత్ కాంగ్రెస్ జిల్లాఉపాధ్యక్షులు పెండం శ్రీకాంత్,మాజీ ఎంపీపీ జెట్టి సోమయ్య,జంపాల చంద్ర శేఖర్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుజంపాల ప్రభాకర్, సీనియర్ నాయకులుపాశం మాధవ రెడ్డి, బేతి దేవేందర్ రెడ్డి, ఆర్ వెంకటేశ్వర్లు,రామ్మోహన్,వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు