రాంపురం గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

మరిపెడ మండలం రాంపురం గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాల వేడుకలు జరుపుకున్నారు,తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో భాగంగా శ్రావణమాసం ఏళ్లుదాలకు అసలేరు కార్తెలో ఏటా నిర్వహించుకునే సాంప్రదాయం ప్రకారం ముత్యాలమ్మ తల్లీ అమ్మవారి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.అనంతరం గ్రామ ప్రజలు, భక్తులతో కలిసి బోనాల వేడుకల్లో పాల్గొని వారితో ఆత్మీయంగా ముచ్చటించారు.ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు,గ్రామ పెద్దలు, భక్తులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
