గోపి నగర్ లో ఉద్యమ మహాధర్నా
శేరిలింగంపల్లి, ( తెలుగు గళం ) న్యూస్: కేటీఆర్ పిలుపుమేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపి నగర్ లో ఉద్యమ మహాధర్నా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో బాకీ కార్డుల మహాధర్నా నిర్వహించారు వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని ప్రజలకు ఇచ్చిన హామీలు విఫలమవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై సమర శంఖారావం పూరించారు ఇది ప్రజా పాలన కాదు దొంగల పాలనాని శేరిలింగంపల్లి బి ఆర్ స్ సీనియర్ పార్టీ నాయకులు మారబోయిన రవి యాదవ్ అన్నారు ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై మహా ధర్నా నిర్వహించారు అనంతరం గోపి నగర్ పరిధిలోని ప్రతి ఇంటికి తిరిగి బాకీ కార్డులను పంపిణీ చేశారు కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రతి ఇంట్లో ఉన్న మహిళలకు వివరించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం దురదృష్టకరమన్నారు రైతు భరోసా రుణమాఫీ ఉచిత విద్యుత్తు విద్యార్థులు ఉద్యోగులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు ప్రజా సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని రవి యాదవ్ ఫైర్ అయ్యారు కేటీఆర్ పిలుపుమేరకు నియోజకవర్గంలోని నాయకులు మహిళా కార్యకర్తలు అనుబంధ సంస్థ సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు
