సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలిగా వారణాసి మౌనిక అంజి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలిగా వారణాసి మౌనిక అంజి బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మండల సర్పంచ్ల సమావేశంలో గౌరవాధ్యక్షురాలిగా కేసీ రెడ్డి సబితా ప్రతాప్ రెడ్డి,ఉపాధ్యక్షుడిగా చేరి వీరన్న,ప్రధాన కార్యదర్శిగా మొర్రి సురేష్,కోశాధికారిగా అన్నారపు సువర్ణ,గౌరవ సలహాదారుగా భూతం రజిత,కార్యవర్గ సభ్యులుగా మామిడిశెట్టి రవీందర్,జమలాపురం మోహన్ రావు,గడ్డే రఘులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మౌనిక అంజి మాట్లాడుతూ మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి,సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచ్లు పాల్గొన్నారు.
